ఆర్ఆర్ఆర్ తెలుగు సినీ ప్రపంచంలో చరిత్రలు తిరగరాసిన సినిమా అని చెప్పవచ్చు. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ వసూళ్ల పరంగానూ తనదైన శైలిని చూపించింది. ఈ క్రమంలోనే సినీ ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు అయిన ఆస్కార్ బరిలో కూడా ఆర్ఆర్ఆర్ నిలిచింది.
అయితే తాజాగా ఆర్‌ఆర్ఆర్ తన అమ్ములపొదిలోకి మరో ప్రతిష్టాత్మక అవార్డును వేసుకుంది.అంతర్జాయతీయ స్థాయిలో చలన చిత్ర విభాగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అయితే.. ఆ తరువాత స్థానంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులుంటాయి. అలాంటి ఉన్నతమైన అవార్డు ఇప్పుడు మన ఇండియన్ సినిమా.. మన తెలుగు సినిమాకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.
ఈ అవార్డును ప్రకటిచండంతో రాజమౌళి చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులేశాడు. అయితే చిరంజీవి మాత్రం సంతోషంతో ఉబ్బితబ్బిబైనట్టు కనిపిస్తోంది. ఆయన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
”ఇదో గొప్ప చరిత్ర.. ఎప్పటికీ నిలిచిపోతుంది.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం అద్భుతం.. మీకు శతకోటి వందనాలు.. ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళికి కంగ్రాట్స్.. ఇప్పుడు ఇండియా ఎంతో గర్వపడుతూ ఉంటుంది” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
అంతే కాకుండా మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మన్ కూడా ట్విట్టర్ వేదికగా ఆర్‌ఆర్ఆర్ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
”ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి కంగ్రాట్స్.. రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్” అని ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు.