• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఆఫ్రికాలో బ‌య‌ట ప‌డ్డ బంగారం కొండ‌‌.. జ‌నాలు ఎగ‌బ‌డి త‌వ్వుకున్నారు.. వీడియో..!

Published on : March 9, 2021 at 3:06 pm

ప్ర‌పంచంలో అనేక దేశాల్లోని చాలా ప్రాంతాల్లో బంగారు గ‌నులు ఉన్న విష‌యం విదిత‌మే. అలాగే కాంగోలోనూ ఉన్నాయి. అయితే అక్క‌డి ఓ ప్రాంతంలో తాజాగా బంగారు కొండ ఒక‌టి బ‌య‌ట ప‌డింది. అందులో పెద్ద ఎత్తున బంగారం ఉంద‌ని తెలుసుకున్న స్థానికులు బంగారాన్ని త‌వ్వుకోవ‌డం కోసం ఎగ‌బ‌డ్డారు. దీంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Feture image

 

మ‌ధ్య ఆఫ్రికాలోని రిప‌బ్లిక్ ఆఫ్ కాంగోలో ద‌క్షిణ కివు ప్రావిన్స్ లోని లుహిహి అనే గ్రామంలో బంగారంతో నిండిన కొండ ఒక‌టి బ‌య‌ట ప‌డింది. అందులో 60 నుంచి 90 శాతం వ‌ర‌కు బంగారం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆ విష‌యం తెలుసుకున్న స్థానికులు ప‌లుగు, పార ప‌ట్టుకుని కొండ వ‌ద్ద‌కు వెళ్లి బంగారాన్ని తవ్వుకోవ‌డం మొద‌లు పెట్టారు. కొంద‌రైతే ఏకంగా అక్క‌డే చేతుల్తోనే మ‌ట్టిని తోడుతూ మ‌ట్టిని నీటిలో వేస్తూ బంగారాన్ని వేరు చేయ‌డం మొద‌లు పెట్టారు.

A video from the Republic of the Congo documents the biggest surprise for some villagers in this country, as an entire mountain filled with gold was discovered!
They dig the soil inside the gold deposits and take them to their homes in order to wash the dirt& extract the gold. pic.twitter.com/i4UMq94cEh

— Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021

అయితే ఈ సంఘ‌ట‌న‌కు చెందిన ఓ వీడియోను అక్క‌డి ఫ్రీ లాన్స్ జ‌ర్న‌లిస్ట్ అహ్మ‌ద్ ఆల్గోబ‌రీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే విష‌యం తెలుసుకున్న అక్క‌డి ప్ర‌భుత్వం ఆ కొండ వ‌ద్ద త‌వ్వ‌కాలు చేప‌ట్టడాన్ని నిషేధించింది. అక్క‌డికి ఎవ‌రూ వెళ్ల‌వద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే మైనింగ్ సంస్థ‌ల‌కు అధికారికంగా ఆ కొండ‌ను కాంట్రాక్ట్‌కు ఇవ్వ‌నున్నారు.

అయితే కాంగోలో బంగారు గ‌నుల్లో త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. అక్క‌డ ఇలాగే జ‌రుగుతుంది. కానీ ఆ దేశం నుంచి అక్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు ర‌వాణా అయ్యే బంగార‌మే ఎక్కువ శాతం ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డి ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోవ‌డం త‌ప్ప చేసేదేమీ ఉండ‌దు.

 

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏప్రిల్ 30న ఓటీటీలో 'సుల్తాన్'!

ఏప్రిల్ 30న ఓటీటీలో ‘సుల్తాన్’!

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి 'రాధే'

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి ‘రాధే’

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

ఏపీలో క‌రోనా ఉప్పెన‌- ఒక్క‌రోజే 10 వేల కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)