ఓ ఆలయానికి దర్శనానికి పోతే.. ప్రసాదానికి బదులు బంగారం,వెండి,డబ్బులు ఇస్తున్నారట. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపించినప్పటికీ..నమ్మక తప్పదు అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
ఈ ఆలయం కొలువైంది మధ్యప్రదేశ్ రత్లామ్ లో. ఇక్కడి మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడువునా భక్తులతో రద్దీగా ఉంటుంది.కుబేరుని నిధిగా పేరున్న ఈ ఆలయంలో ఏది సమర్పించినా అది రెట్టింపు అవుతుందని అక్కడి భక్తులు నమ్ముతుంటారు.
ఆ నమ్మకంతోనే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నగలు, కోట్లాది రూపాయల నగదు,వెండి ఆభరణాలు సమర్పించుకుంటారు.అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో ఐదు రోజులపాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బులతో అమ్మవారిని అలంకరిస్తారు.
అదేవిధంగా..ఆలయాన్ని దర్శించుకున్నతర్వాత భక్తులు ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో ఆలయ నిర్వాహకులు.. ప్రసాదానికి బదులు బంగారం, వెండి, డబ్బులు ఇలా ఏదో ఒకటి ఇస్తారట.