ఏపీలోని మదనపల్లిలో క్షుద్రపూజలతో తన ఇద్దరు బిడ్డలను చంపేసిన తల్లితండ్రులపై అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నా… క్షుద్రపూజలు చేస్తూ, తన సొంత బిడ్డలనే బలిపెట్టడంపై విస్మయం వ్యక్తం అవుతుంది. మదనపల్లి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా తండ్రి పురుషోత్తం నాయుడు పనిచేస్తున్నాడు. తల్లి పద్మజ ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. పైగా స్థానికంగా మాస్టర్ మైండ్స్ అనే స్కూల్ నడుపుతున్నారు. తనే స్వయంగా స్కూల్ చూసుకుంటున్నారు.
ఇక తల్లితండ్రుల మాయలో పడ్డ పెద్ద అమ్మాయి అలేఖ ఎంబీఏ చదువుతుండగా, చిన్నమ్మాయి బీబీఏ పూర్తి చేసింది. తమ ఇద్దరు బిడ్డలను క్షుద్రపూజల మాయలో పడి… అతి కిరాతకంగా చంపేశారు. చంపేందుకు ముందు ఇద్దరు అమ్మాయిలకు అరగుండు చేసి, నోట్లో చిన్న రాగిచెంబు పెట్టి శూలంతో చంపినట్లు పోలీసులు చేర్చారు.
పురుషోత్తంనాయుడు కుటుంబ సభ్యులు మెహర్ బాబాను నమ్మేవారని… ఆశ్రమాన్ని తరుచూ సందర్శించేవారని ఆయన సన్నిహితులంటున్నారు. ఈ మొత్తం ఘటన వెనుక ఎవరో ఉన్నారని, వారే వీరిని ప్రభావితం చేశారంటున్నారు.