గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల చేసిన వ్యాఖ్యల పై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే అయ్యప్ప దీక్షలో ఉంటూ వంశీ చేస్తున్న వ్యాఖ్యలు అయ్యప్ప భక్తులు మనోభావాలు దెబ్బతీసేవిదంగా ఉన్నాయని గొల్లపూడి అయ్యప్పస్వామి భక్త కమిటీ బహిరంగ లేఖని విడుదల చేసింది.
వల్లభనేని వంశీ తీరు మార్చుకోవాలి, అసభ్యపదాలు ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు అంటూ లేఖ లో కమిటీ చెప్పుకొచ్చింది.