నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే 11,012 గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. ఇప్పుడు వీటికి మరో రెండు వేల పోస్టులు కలవనున్నాయి. అంతే కాదు ఇప్పుడు వీటిన్నింటిని ఓకేసారి భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది.
అయితే ప్రస్తుతం గురుకులాల్లో భర్తీకి 11 వేల 12 పోస్టులకు అనుమతులు లభించాయి. తాజా పోస్టులతో 13 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ,ఎస్టీ గరుకులాల పోస్టులు వీటితో పాటు భర్తీ చేయనున్నారు.
సంక్షేమ గురుకులాల్లో మొదటగా రాష్ట్ర ప్రభుత్వం 9096 ఉద్యోగాలకు ప్రకటన చేసింది. 2022- 2023 విద్యా సంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో నూతనంగా 33 బీసీ గురుకుల స్కూల్స్, 15 బీసీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు. వాటికి సంబంధించిన బీసీ సొసైటీ పరిధిలో నూతనంగా 33 బీసీ గరుకుల స్కూల్స్, 15 బీసీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు.
వాటికి సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ గవర్నమెంట్ కి ప్రతిపాదనలు పంపించింది. దీంతో జనవరిలో బీసీ గురుకుల సొసైటీ లో 2591 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో గురుకులాల బోధన పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కోడ్ ముగిసే సమయానికి ఈ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగాలకు అనుమతులు వస్తే అన్నింటిని కలిపి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.