కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన పుష్ప సినిమా షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. చిత్రయూనిట్ లో కొందరికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావటంతో… షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. దీంతో షూటింగ్ ఎప్పుడు అన్న సందేహం నెలకొనగా… ఇప్ఉడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.
నిజానికి కరోనా ప్యాకప్ టైంలో మరో 20 రోజుల వరకూ పుష్ప షూటింగ్ ఉండదనుకున్నారంత. కానీ నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీం ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 13 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తూ.గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అటవి ప్రాంతంలో మరో 5 రోజుల షెడ్యూల్ మిగిలి ఉండగా, ఆ మిగిలిన షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేయబోతున్నారు.
ఈసారి వీలైనంత తక్కువ మందితో మిగిలిపోయిన పార్ట్ పూర్తి చేయనున్నారు. అయితే, ఈ 5రోజుల షూట్ లో బన్నీ ఉంటాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.