కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 7వ పే కమిషన్ కింద 28 శాతానికి పెరిగింది. ఈ డీఏ పెంపు తర్వాత మోడీ ప్రభుత్వం 6వ పే కమిషన్ కింద జీతం తీసుకునే కేంద్ర ఉద్యోగులకు కూడా బహుమతి ఇచ్చింది. సెంట్రల్ అటానమస్ బాడీస్ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌లో ఇది భారీ పెరుగుదల అని చెప్పొచ్చు. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఈ ఉద్యోగుల డీఏ ఏప్రిల్ 2020 నుండి ఆపేశారు. ఈ సంవత్సరం జూలై 1 నుండి మళ్ళీ డీఏ ఇవ్వడం తిరిగి ప్రారంభించారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని 25%పెంచారు. దీంతో అది 189%కి పెరిగింది. ఇప్పటి వరకు వారు 164 శాతం డీఏ పొందుతున్నారు. కొత్త డీఏ 1 జూలై 2021 నుండి వర్తిస్తుంది. అయితే ఒకటిన్నర సంవత్సరాలు ఇవ్వకుండా ఆపేసిన డీఏల ప్రస్తావన ఇక ఉండదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నిర్మలా దేవ్ ప్రకటన ప్రకారం ప్రస్తుతం 6వ పే కమిషన్ కింద జీతం చెల్లిస్తున్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఉత్తర్వు జారీ చేశారు. అలాగే ఈ ఆర్డర్ కాపీని సిఏజి, యూపిఎస్సితో సహా ఇతర విభాగాలకు పంపించారు. డీఏ ప్రభావం ఇంటి అద్దెపై కూడా కనిపిస్తుంది. హెచ్ఆర్ఏ వరుసగా X, Y, Z కేటగిరీలలో 7వ పే కమిషన్ కింద 27 శాతం, 18 శాతం, 9 శాతానికి పెంచారు.
Advertisements
అదే సమయంలో కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు 2021 జూన్ కి గానూ డియర్నెస్ అలవెన్స్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 2021 కొరకు డిఎ పెంపు 3 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర ఉద్యోగుల డీఏ 31 శాతానికి చేరుకుంటుంది. జూన్‌లో ఏఐపిఐ డేటా 1.1 పాయింట్లు పెరిగింది. దీని కారణంగా సూచిక 121.7 కి చేరుకుంది. అంటే డీఏ 31.18 శాతంగా ఉండాలి. అయితే ఇది రౌండ్ ఫిగర్‌లో 31 శాతంగానే ఉంటుంది. ప్రభుత్వం త్వరలో దీనిపై కూడా ప్రకటన చేయవచ్చు.