తెలుగు సినిమాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుందంటే చాలు…మూవీపై ఓ రేంజ్ లో అంచనాలుంటాయి. ఆయన డైరక్షన్ లో ఓ సాధారణ సినిమా రూపొందుతోందంటేనే ఓ రకమైన అంచనాలు నెలకొని ఉంటాయి అలాంటిది ఆసక్తిగొల్పేలా సినిమా రాబోతుందని తెలిస్తే..ఇంకేం అభిమానుల్లో ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే ఫిక్షన్ స్టోరీతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సగానికిపైగా కంప్లీట్ చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలని అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తి కనిపిస్తోంది. ఇక, ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ లెట్ చేస్తే బాగోదని అనుకున్నారో ఏమో కాని తెలుగు సంవత్సరాది ఉగాది సందర్బంగా
ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్ పోస్టర్‌ను డీవీవీ మూవీస్ రిలీజ్ చేస్తే.. తమిళంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయనున్నారు. హిందీలో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను అజయ్ దేవ్‌గణ్ విడుదల చేయనున్నారు. కన్నడ వెర్షన్‌కు సంబంధించిన పోస్టర్‌ను వారాహీ చలన చిత్రం వాళ్లు రిలీజ్ చేస్తే.. మలయాళానికి సంబంధించిన దాన్ని రామ్ చరణ్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.