సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉండే ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. కుటుంబ సభ్యులతో కనీసం కట్టుకున్న వారితో కూడా ఎక్కువ సమయాన్ని గడపాలని పరిస్థితుల్లో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ఆత్మహత్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ఐటీ రంగం క్రమంగా వృద్ధి సాధిస్తోంది.
ఈ నేపథ్యంలో కొన్ని నష్టాలను అధిగమించడానికి ఉద్యోగులపై పని భారాన్ని కూడా కంపెనీలు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక భారతీయ ఐటి కంపెనీ కీలక అడుగు వేసింది. సైబర్ సెక్యూరిటీ కంపెనీ టీ ఏ సి సెక్యూరిటీ వారంలో నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ గా ప్రకటించింది. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే కంపెనీ పని చేస్తుందని తెలిపింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమ కంపెనీలో సెలవులు ఉంటాయని పేర్కొంది.
దీనికి సంబంధించి కంపెనీ నిర్ణయం తీసుకోవడానికి కంటే ముందు అంతర్గత సర్వే ఒకటి చేసింది. 80 శాతం మంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయడానికి సుముఖంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. అలాగే కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల వల్ల కొంత మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి వాళ్లకు సుదీర్ఘ వారాంతాలు ఇవ్వడానికి తాము సిద్ధమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై త్వరలోనే శాశ్వత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని పేర్కొంది.