టాలీవుడ్ అభిమానులకు ఓ శుభవార్త వచ్చేసింది. మెగా, నందమూరి కథానాయకులు యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చింది.
గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి దింపింది. మనవాళ్లు పట్టించుకోలేదు. కానీ అమెరికన్స్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ ను తమ సినిమాగా భావించారు. యు.ఎస్‌లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్‌ను పంపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ వై సీ క్యాంపెయిన్‌లో భాగంగా RRRను పలు విభాగాలకు ఇండిపెండెంట్‌గా పంపడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మోషన్ పిక్చర్ లలో ఆర్ఆర్ఆర్ కు మంచి ఛాన్స్ ఉంది.పై కేటగిరీల్లో ఏది సాధించిన భారతీయ సినీ అభిమానులు గర్వ పడతారు.
1920 సమయంలో ఇద్దరు స్వాతంత్య్ర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ బ్రిటీష్ వారిని ఎదిరించారు. వారిద్దరూ ఎక్కడా, ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ వాళ్లిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుంది. అనే కథాంశంతో RRR చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. సినిమా ఈ ఏడాదిలో విడుదలై రూ.1200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
It’s official: #RRRMovie’s FYC awards/Oscars campaign is going for Best Picture, @ssrajamouli for Best Director, Actor (both Jr NTR & Ram Charan), Screenplay, Original Song, Score, Editing, Cinematography, Sound, Production Design, VFX and more categories #RRRforOscars #OscaRRRs pic.twitter.com/gJh8PzmjmY
— jen yamato (@jenyamato) October 5, 2022