పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలోనే పవన్ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ రాబోతోంది. అది కూడా అలాంటిలాంటి అప్ డేట్ కాదు. ఏకంగా కొన్ని పోస్టర్లు, వీడియో గ్లింప్స్ లాంటివి ఒకేసారి విడుదల చేయబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా మేటర్ ఇది.
మరికొన్ని రోజుల్లో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు పవన్ కల్యాణ్. బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. ఈ వీడియో పవర్ ఫుల్ గా ఉండబోతోంది. పైగా లెంగ్త్ కూడా ఎక్కువే. దాదాపు టీజర్ లా అనిపించేంత పెద్దదిగా ఈ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఇదొక యాక్షన్ కట్ అని తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బజ్ తగ్గిపోయింది. షూటింగ్ రోజురోజుకు ఆలస్యం అవుతుండడంతో, సినిమా లైమ్ లైట్లో లేకుండా పోయింది. దీంతో సినిమాను మరోసారి హైలెట్ చేసేందుకు, పవన్ బర్త్ డే ను వేదికగా వాడుకోవాలని యూనిట్ భావిస్తోంది. అందుకే టీజర్ లెవెల్లో గ్లింప్స్ విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరగడం లేదు. త్వరలోనే పవన్ కల్షీట్లు తీసుకొని, కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ నుంచి రాబోతున్న ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా సినిమా ఇది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్.