సాధారణ బడ్జెట్ (బడ్జెట్ 2022)లో వచ్చే మార్పులకు సంబంధించి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఏ మార్పులు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోయినా ఉద్యోగులు మాత్రం మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. నిపుణులు అంచనా వేస్తున్న దాని ఆధారంగా చూస్తే… ఉద్యోగస్తులు ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఫిబ్రవరి 1, 2022న నాల్గవసారి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్… తన బడ్జెట్ లో కొన్ని కీలక అంశాలలో ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి పన్ను మినహాయింపులో ఎటువంటి పెంపుదల లేనప్పటికీ, ఉద్యోగస్తులకు ఈ ఏడాది పన్ను మినహాయింపు పరిమితిలో కొంత పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుత పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలుగత ఎనిమిదేళ్లుగా అలాగే ఉంది. గతంలో, పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుండి కాస్త పెంచడంతో ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం ప్రకటించింది. 2.5 లక్షలు వరకు పెంచింది. పన్ను మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచాలని భావిస్తోంది. ఉద్యోగులకు పన్ను ఆదా చేయడంలో ప్రస్తుతం కీలక సమయం కాబట్టి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ప్రభుత్వం రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు ప్రకటించింది. గతంలో ఈ మినహాయింపును రూ.1 నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. 2022 బడ్జెట్‌లో, ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచుతుందని భావిస్తున్నారు.