సొంత ఇల్లు అనేది ప్రతి పేద మధ్య తరగతి ప్రజల కల.తమ జీవితంలో ఎప్పటికైనా సొంత్తిల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. కాని ఈరోజుల్లో ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చాలా కష్టం. ఇక ఇళ్లు కొనాలనుకునేవారికి ఇక్కడో శుభవార్త వుంది. వచ్చే సంవత్సరంలో ఇళ్ల ధరలు భారీగా తగ‍్గే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రీ-లాంచ్ సేల్ ఆఫర్ల కారణంగా 2022 మార్చి నెల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ తెలిపడం జరిగింది.
ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ స్పందించడం జరిగింది.ఇక అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ..సెప్టెంబర్ 30 వ తేదీ నాటికి బిల్డర్లు 58,535 యూనిట్ల అమ్ముడుపోని ప్లాట్లు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
జూలై నెల నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 8,000 యూనిట్లు మార్కెట్‌లో ఉండగా ఇక ఈ కాలంలో 6,735 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వడం జరిగిందట. సప్లయి ఎక్కువగా ఉండి,కొనే వారు లేకపోవడంతో ప్లాట్లు అమ్ముడుకావడం లేదని ఇక ఆ ప్లాట్లను సేల్ చేయాలంటే కొనుగోలు దారులకు అనుగుణంగా ధరల్ని తగ్గించడమని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు.ఇక ఇది ఇల్లు కొనాలనుకునే సామాన్యులకు మంచి శుభవార్త అనే చెప్పాలి.