తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడి శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. వీకెండ్ లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడి ప్రకటించింది. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడి పాలక మండలి.
శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం అదనంగా దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకెన్లు టీటీడి అందిస్తోంది.
Advertisements
టీటీడి తాజా నిర్ణయంతో భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు.