కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఉద్యోగాల కల్పనలో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలియజేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అధిక శాతం భారత్‌కే అవకాశముంటుందని కాగ్నిజెంట్ ఇండియా ఎండీ రాజేష్ నంబియార్ ప్రకటించారు.
ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికం కాగా… ఇందులో ఎక్కువ ఉద్యోగాలు భారత్ కే ఎక్కువ వచ్చినట్లు తెలిపారు. కాగ్నిజెంట్ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దేశీయంగా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్టపరచడం, నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా యూనివర్శిటీలతో భాగస్వామ్యలు ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలను సాధించాల్సి ఉందని తెలుస్తోంది.