ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి కేజీఎఫ్-2. కరోనాతో పాటు సినిమాలో విలన్ గా చేస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ కారణంగా సినిమా షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో సంజయ్ దత్ పై మినహా ఇతర షూటింగ్ పార్ట్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పూర్తి చేశారు.
తాజాగా ప్రశాంత్ నీల్ సంజయ్ దత్ కలుసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం కాస్త మెరుగయిన నేపథ్యంలో బల్క్ డేట్స్ ఇచ్చారని, డిసెంబర్ లో షూటింగ్ కు సంజయ్ దత్ హాజరవుతారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేయనున్నారు. దీంతో సినిమా రిలీజ్ 2021 సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.