వాషింగ్టన్: బట్టతల బాబులకు ఇక గుడ్ న్యూస్! పెళ్ళికాని బట్టతల అబ్బాయిలు త్వరలోనే తలపై జుట్టు మొలిపించుకోవచ్చు. యుక్త వయస్సులో బోడిగుండుగా మరీనా వారూ ఇక ఎంచక్కా క్రాఫ్ స్టైల్ మార్చవచ్చు. బట్టతల సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సక్సెస్.
బట్టతలపై వెంట్రుకలు మొలిపించడానికి నానో జనరేటర్ల టెక్నిక్ ఉపయోగించారు. నానో జనరేటర్లతో ఎలుకలపై శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వెల్లడించారు. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడానికి నానో జనరేట్లతో తయారుచేసిన దండను తలకు కడతారు. దానిపై మనం ఎండాకాలంలో వాడే బేస్‌బాల్ టోపీని పెట్టుకుంటే సరిపోతుంది. నానో జనరేట్ల దండ తలకు కట్టుకున్న వ్యక్తి కదలికలతో అవి అతిస్వల్ప పౌనఃపున్యంతో విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ తరంగాల ప్రభావంతో బట్టతలపై నిద్రాణంగా ఉన్న సూక్ష్మరంధ్రాలు చైతన్యవంతమై వెంట్రుకలు మొలుస్తాయి. ఇది శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగం. త్వరలోనే బట్టతల బాబులకు అందుబాటులోకి వస్తుంది.