అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు న్యూ ప్రెసిడెంట్ జో బైడెన్. హెచ్1-బీ వీసాల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు ఊరట కలగనుంది.
అమెరికాలో హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఒబామా హయాంలో వాళ్లకు ఈ అవకాశం కల్పించగా… గత ట్రంప్ ప్రభుత్వం దానిని రద్దు చేసే ప్రయత్నం చేసింది. ట్రంప్ వైట్‌హౌజ్‌లో ఉన్నంత కాలం ఆందోళనలోనే ఉన్న హెచ్-4 డిపెండెంట్ వీసాదారులు, తాజా ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్నారు. హెచ్1-బీ వీసాదారుల్లో ఎక్కువ శాతం ఇండియా, చైనా వాళ్లే ఉండటంతో… వారికే ఎక్కువ లాభం చేకూరనుంది.