సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన ఐఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు నూతన ఓఎస్ వెర్షన్ అప్ డేట్స్‌ను అందిస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఐఓఎస్ 14.3 బీటా వెర్షన్‌ను లాంచ్ చేసింది. కానీ ఇది డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పూర్తి స్థాయి ఐఓఎస్ 14.3 వెర్షన్‌ను యాపిల్ డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనుంది. అందులో చాలా కొత్త ఫీచర్లను యాపిల్ తన యూజర్లకు అందివ్వనుంది.
ఐఓఎస్ 14.3 అప్‌డేట్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ హెడ్ ఫోన్స్‌కు సపోర్ట్‌ను అందజేయనున్నారు. సదరు హెడ్ ఫోన్స్ ను యాపిల్ ఇటీవలే విడుదల చేసింది. మరో వారం రోజుల్లో ఆ హెడ్ ఫోన్స్ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఐఫోన్లలో ఆ హెడ్ ఫోన్స్‌కు సపోర్ట్ కోసం ఐఓఎస్ 14.3 అప్‌డేట్‌ను అందిస్తారు. ఆ హెడ్ ఫోన్స్ ధర రూ.59,990గా ఉంది. వాటిల్లో హై ఫిడెలిటీ ఆడియో, అడాప్టివ్ ఈక్యూ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, స్పేషియల్ ఆడియో, కుషన్ లాంటి ఇయర్ కప్స్ తదితర అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక ఐఓఎస్ 14.3లో ProRAW ఫీచర్‌ను అందిస్తారు. దీని సహాయంతో ఐఫోన్ 12 ఫోన్లలో కెమెరాల ద్వారా ఇమేజ్‌లను RAW ఫార్మాట్‌లో బంధించవచ్చు. దీంతో ఫైల్ సైజ్ పెరిగినా అద్బుతమైన క్వాలిటీతో ఇమేజ్‌లను ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోలను 25ఎఫ్‌పీఎస్ స్పీడ్‌తో రికార్డు చేసుకునే విధంగా ఐఓఎస్ 14.3లో ఫీచర్ ఇవ్వనున్నారు. ఇక పాత ఐఫోన్లలో సెల్ఫీలను తీసుకునేందుకు మిర్రర్ ఆప్షన్ ను అందిస్తారు. ఆ ఫీచర్ కూడా ఆ ఫోన్లలో ఐఓఎస్ 14.3 అప్‌డేట్ ద్వారా లభిస్తుంది. ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, 7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఎక్స్ ఫోన్లలో మిర్రర్ ఆప్షన్ కొత్త ఓఎస్ అప్‌డేట్ ద్వారా లభిస్తుంది.
ఐఓఎస్ 14.3లో కొత్తగా యాపిల్ టీవీ ప్లస్ ట్యాబ్‌ను ఇస్తారు. దీని సహాయంతో యాపిల్ టీవీ ప్లాట్‌ఫాంను మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చు. కొత్త అప్‌డేట్‌లో యాపిల్ ఫిట్‌నెస్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అందుకు యూజర్లు తమ వాచ్‌లలో వాచ్ ఓఎస్ 7.2కు అప్‌డేట్ అవ్వాలి. వాచ్ సిరీస్ 3 ఆ తరువాత వచ్చిన వాచ్‌లలో ఈ ఫీచర్ లభిస్తుంది. అయితే ఇది కేవలం ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూకే, అమెరికా దేశాల్లోని పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక హెల్త్ యాప్, వెదర్ యాప్, క్లిప్స్, సఫారి వంటి యాప్‌లను మోడిఫై చేసి ఐఓఎస్ 14.3లో అందివ్వనున్నారు. అందువల్ల ఆయా యాప్స్ మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే యాప్ స్టోర్‌లో లిస్ట్ అయి ఉన్న అన్ని యాప్స్‌కు గాను యూజర్లకు కొత్తగా ప్రైవసీ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఐఓఎస్ 14.3 అప్‌డేట్ ద్వారా ఐఫోన్ 12 ఫోన్లలో మాగ్ సేఫ్ డ్యుయో చార్జర్‌లకు వస్తున్న సమస్య పరిష్కారం కానుంది. ఇక మరిన్ని ఫీచర్లతో ఐఓఎస్ 14.3 అప్ డేట్‌ను యాపిల్ తన ఐఫోన్ యూజర్లకు త్వరలో అందివ్వనుంది.