తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇక కరోనా కారణంగా ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ కాబోతుంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే విజయ్ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
ఇదిలా ఉండగా దీపావళి కానుకగా మాస్టర్ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు.