తెలంగాణలో మద్యం షాపుల యాజమన్యాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2019-21 సంవత్సరాలకు గాను అమల్లో ఉన్న మద్యం షాపుల లైసెన్సులను పొడిగించాలని, కరోనా కారణంగా దాదాపు 45రోజుల పాటు షాపులు మూసే ఉన్నాయని, తమను ఆదుకోవాలని మద్యం షాపుల ఓనర్లు చేసిన వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లైసెన్సు గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఆ తర్వాత కొత్త లెసైన్సులకు వెళ్లబోతున్నట్లు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తున్న లెసైన్సు గడువు అక్టోబర్ చివరి వరకు పెరిగింది.
నవంబర్ నుండి కొత్త లైసెన్సుల జారీ కోసం ప్రక్రియను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ సారి కొత్త లైసెన్సులకు భారీగా స్పందన ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.