విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ గాలిలో ఇంకా స్టైరీన్ మూలాలుండటంతో విశాఖలోని గోపాలపట్నం సమీపంలో గూడ్స్ రైలు ఆపిన లోకోపైలెట్లు శ్వాస తీసుకోవటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారు 45 నిమిషాల పాటు అక్కడే ఆగిపోవటంతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిపడుతుండటంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇలా ఇప్పటి వరకు ఐదుగురు లోకోఫైలెట్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.
విష వాయువు వల్ల ఇప్పటికే 12మంది మృతి చెందగా పలువురు చికిత్స పొందుతున్నారు. ఇక గ్యాస్ ప్రభావంతో ఖాళీ చేసిన 5గ్రామాల్లో పచ్చని చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో వారందరిని ఊర్లలోకి పంపటానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనపడుతోంది.