ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ తయారు చేసుకోవటం ఏంటీ అనుకుంటున్నారా…? కానీ జులై నెలలో ఇదే అంశాన్ని ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారట. వినటానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా ఈ అంశాన్ని గూగుల్ కూడా దృవీకరించింది. జులైలో ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన అంశాల్లో అమితాబచ్చన్ కు కరోనా ఉందా…? అన్నది ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, వ్యాక్సిన్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది సెకండ్ ప్లేస్ లో నిలిచిందని సంస్థ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ గురించి చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుందని, అది 15వ స్థానానికి పడిపోయింది.
అమితాబ్ కు కరోనా పాజిటివ్ ఉందా అని 5వేల శాతం మంది చూడగా, కరోనా కవచ్ పాలసి, రక్షక్ పాలసీని 3300శాతం మంది, ఐశ్వర్యరాయ్ కు కరోనా కీవర్డ్ ను 2550శాతం మంది చూశారు.
ఇక ఇండియాలో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయని సిక్కిం ప్రజలు ఎక్కువగా చూశారు. ఆ తర్వాత డయ్యూ డామన్, అండమాన్ నీకోబార్ దీవులున్నాయి.