గూగుల్ కొత్తగా తీసుకు వస్తున్న చాట్ బాట్ బార్డ్ ఆ సంస్థ కొంప ముంచింది. చాట్ బాట్ బార్డ్ చేసిన చిన్న పొరపాటుతో ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. చార్ట్ బాట్ తో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు ఏకంగా 100 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.
చార్ట్ బార్డ్ ఏఐ సర్వీస్‌ను అత్యంత త్వరగా మార్కెట్ లోకి తీసుకు రావాలని ఇప్పటికే గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇటీల ఓ ప్రమోషనల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో చార్ట్ బాట్ తప్పుడు సమాచారం అందించింది.
సౌర వ్యవస్థకు బయట వున్న గ్రహాన్ని గుర్తించి ఫోటోలు తీసిన శాటిలైట్ ఏదని చాట్ బాట్ ను అడిగారు. దానికి చాట్ బాట్ బదులిస్తూ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొట్టమొదటి చిత్రాన్ని తీసిందని జవాబిచ్చింది. కానీ ఈ జేమ్స్ వెబ్ స్పేస్‌ను గతేడాది ప్రయోగించారు.
ప్యారిస్‌లో ఏర్పాటులో చేసిన బార్డ్ లాంచ్ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు ఈ పొరపాటును రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో బార్డ్ పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఈ ప్రభావం అల్ఫాబెట్ షేర్లపై పడింది. అల్ఫాబెట్ షేర్లు 9శాతం నష్టపోయి గూగుల్ మాతృసంస్థ భారీగా నష్టపోయింది.