2019 సంవత్సరం ఇంకో రెండు వారాల్లో కంప్లీట్ కానుంది. అయితే ఇక్కడ విశేషం ఏముంది అనుకుంటున్నారా…? ప్రతి సంవత్సరం ఆఖరులో గూగుల్ ఏడాదిలో జరిగిన ఆశక్తికర అంశాలు, విషయాలు బయటకు వస్తుంటాయి. తాజాగా గూగుల్ దీనికి సంబందించిన కొన్ని విషయాలను వెలువరించింది.
అయితే మన పొరుగు దేశమైన పాకిస్థానీయులు ఎక్కువగా గూగుల్ ఏమి చూసారో తెలుసా.. ఆ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
ఎక్కువగా ఈ ఏడాదిలో గూగుల్‌లో మన ఇండియన్స్ గురించే పాకిస్తానీయులు సెర్చ్ చేశారు. పుల్వామా ఘటన, వింగ్ కమాండర్ అభినందన్ గురించి అందరికీ తెలిసిందే. పాక్ కూడా ఇదే అంశంపై ఎక్కువగా గూగుల్ సర్చ్ చేశారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ సేఫ్‌గా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రజలు గూగుల్ సర్చ్‌లో వింగ్ కమాండర్ అభినందన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ ఉన్నారు.