ఓ హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు గొడవ పడితే ఎలా ఉంటుంది? గోపీచంద్-ప్రభాస్ మధ్య అలాంటి గొడవే జరిగింది. దాదాపు 18 ఏళ్ల కిందట జరిగిన ఆ గొడవను తాజాగా ఈ హీరోలిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా. త్రిష.
గతంలో త్రిషతో ఓ సినిమా చేశాడు ప్రభాస్. అదే టైమ్ లో గోపీచంద్ కు కూడా త్రిష కాల్షీట్లు కావాల్సి వచ్చింది. ఆ టైమ్ లో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లో కూడా చాలా బిజీగా ఉంది త్రిష. దీంతో కాల్షీట్ల సమస్య వచ్చింది.
త్రిష కాల్షీట్ నాకు కావాలంటే నాకు కావాలంటూ ప్రభాస్-గోపీచంద్ గొడవ పడ్డారట. ఈ విషయాన్ని బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-2లో బయటపెట్టాడు గోపీచంద్.
ప్రభాస్, గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ కు చెందిన వ్యక్తిగత విషయాలన్నీ గోపీచంద్ కు తెలుస్తాయి. ప్రభాస్ పై వస్తున్న డేటింగ్ రూమర్స్ అన్నింటినీ గోపీచంద్ కొట్టిపడేశాడు. అనుష్క, కృతి సనన్ ఎవ్వరూ ప్రభాస్ మనసులో లేరని తేల్చిచెప్పాడు.