మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. రీసెంట్ గా చాణక్య సినిమా టైములో కంబ్యాక్ ఇస్తాడనుకున్న గోపీచంద్, దమ్ములేని కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. చాణక్య రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి, ఈసారి గోపీచంద్ హిట్ కొట్టడం ఖాయమని సినీ అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిక్స్ అయ్యి, రెండు సినిమాలు పూజా కార్యక్రమాల కూడా పూర్తి చేశాడు. అందులో ఒకటి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా కాగా మరొకటి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ బ్యానర్ లో కావడం విశేషం. సంపత్ నంది సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది కానీ భోగవల్లి ప్రసాద్ బ్యానర్ లో మొదలైన సినిమా మాత్రం ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చాణక్య నష్టాలు తీసుకురావడం కారణంగానే గోపీచంద్, భోగవిల్లి ప్రసాద్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. బ్యాడ్ ఫేజ్ లో ఉన్న టైములో ఇలాంటివి జరగడం మాములే కానీ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్, సంపత్ నంది మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.