గోపీచంద్ తాజాగా సీటిమార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆరడుగుల బుల్లెట్ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతుంది. గోపీచంద్, నయనతార తొలిసారిగా నటించిన ఈ చిత్రం బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ ఈ కథను అందించారు అబ్బూరి రవి మాటలు రాశారు.
మణిశర్మ సంగీతం అందించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.