కేజీఎఫ్ స్ఫూర్తితో చాలా సినిమాలొస్తున్నాయి. రీసెంట్ గా మార్టిన్ సినిమా టీజర్ కూడా ఇలానే ఉంది. కేజీఎఫ్ ప్యాట్రన్ కనిపించింది. ఇప్పుడు గోపీచంద్ కొత్త సినిమా కూడా కేజీఎఫ్ తరహాలోనే వస్తుందనే టాక్ నడుస్తోంది. దీనికి ఓ కారణం ఉంది.
కేకే రాధామోహన్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నాడు గోపీచంద్. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హర్ష అనే కన్నడ డైరక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ ను ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.
ఇలా ఓ కన్నడ డైరక్టర్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకోవడంతో.. గోపీచంద్ సినిమా కూడా కేజీఎఫ్ టైపులోనే వస్తుందనే సెంటిమెంట్ ఊపందుకుంది. పైగా ఇది కూడా యాక్షన్ సినిమానే.
ఈ నెల్లోనే గోపీచంద్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో రామబాణం సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు గోపీచంద్.