టాలీవుడ్ లో కొందరు దర్శకులు హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. అందులో గోపిచంద్ మలినేని ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నాడు. అతని గురించి ఏ వార్త వచ్చినా ఫాన్స్ ఆసక్తిగా చదువుతున్నారు. ఇక సినిమా జనాలు కూడా ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుంది అనే దానిపై ఆసక్తిగా చూస్తున్నారు. బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమా గోపిచంద్ కి మంచి హిట్ ఇచ్చింది.
ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఒక కథను గోపిచంద్ మలినేని కేవలం ఎన్టీఆర్ కోసమే రాసుకున్నాడు. ఆ కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి చెప్పగా… అంతా బాగుంది గాని నీ మార్క్ కామెడి కనపడలేదు అని ఎన్టీఆర్ అన్నారట. దీనితో ఆ కథను పక్కన పెట్టాడు. ఇప్పుడు మరో కథను స్టార్ హీరో కోసం సెట్ చేసాడు. ఇది కూడా మైత్రీ మూవీస్ వాళ్ళ బ్యానర్ లోనే ఉండే అవకాశం ఉంది.
గోపిచంద్ తో… గోపిచంద్ మలినేని ఒక సినిమా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అటు అల్లు అర్జున్ తో కూడా పుష్ప సినిమా తర్వాత ఒక మాస్ సినిమాను చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కళ్యాణ్ రామ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ చేస్తున్నాడు. ఏది ఎలా ఉన్నా సరే ఈ మాస్ దర్శకుడు ఇప్పుడు కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నాడు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.