సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రాణా ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ మూవీలో రానా పాత్ర కు గాను మొదట గోపీచంద్ ను అనుకున్నారట. కానీ గోపీచంద్ అందుకు ఆసక్తి చూపక పోవడంతో గోపీచంద్ ప్లేస్ లో రానా ని తీసుకున్నారట. ఇదే విషయంపై పవన్ ఫ్యాన్స్ కూడా గోపీచంద్ ఓ అద్భుత అవకాశాన్ని వదులుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక గోపీచంద్ ప్రస్తుతం సినిమా సీటీమార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు.