గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు హీరో గోపిచంద్. అంతేకాకుండా సినిమాకు పెట్టిన కనీస పెట్టుబడి కూడా తీసుకురాలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ లు గా కనిపించబోతున్నారు.
ఇదిలా ఉండగా గోపీచంద్ తన తరువాత చిత్రం సాహో డైరెక్టర్ సుజిత్ తో చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు తొందర్లోనే తెలియనున్నాయి.