ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు మారుతి. ఆ తరువాత బస్ స్టాప్, ప్రేమకథ చిత్రం, భలే భలే మగాడివోయ్ ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో సక్సెస్ ను సాధించాడు. ప్రస్తుతం గోపీచంద్ తో మారుతి సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ చేస్తున్న ఈ సినిమా కు పక్కా కమర్షియల్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను మార్చ్ 5 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.