ఓవైపు పక్కా కమర్షియల్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన గోపీచంద్, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. తనకు కలిసొచ్చిన నిర్మాతలతోనే ఈ సినిమా చేయబోతున్నాడు.
గోపీచంద్ ఈసారి ఆసక్తికరమైన కథని ఎంచుకున్నాడు. డిఫరెంట్ జానర్ సినిమాలను ప్రయత్నిస్తున్నాడు. జె భగవాన్, జె పుల్లారావు నిర్మాణంలో ఈ సినిమా చేయబోతున్నాడు.
గోపీచంద్ తో శంఖం, గౌతమ్ నంద చిత్రాలను రూపొందించిన నిర్మాతలే మూడో సినిమాకి శ్రీకారం చుట్టారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్(జడ్డు బ్రదర్స్ ఎంటర్ టైన్ మెంట్స్) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాతలు ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెంబర్ 2 కింద గోపీచంద్ తో సినిమా చేయబోతున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు ఓ మాస్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడు. ఆ డైరక్టర్ ఎవరనేది మరికొన్ని రోజుల్లో ఘనంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం శ్రీవాస్ తో ఓ చిత్రం చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా పూర్తయిన తర్వాత జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.