రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తేజ… రానాతో పాటు గోపిచంద్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. గోపిచంద్ తో సినిమాకు అలివేలు వెంకటరమణ అనే టైటిల్ ఖరారు చేశాడు. ఈ మూవీలో గోపిచంద్ సరసన నటించే హీరోయిన్ అన్వేషణ కొనసాగుతోంది.
తాజాగా వస్తున్న ఫిలింనగర్ సమాచారం ప్రకారం… గోపిచంద్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ చేయాల్సిన డైరెక్టర్ మారుతీతో సినిమాలో గోపిచంద్ ఫైనల్ అయ్యారు. ఈ మూవీ కోసం తేజ మూవీని వదులుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో తేజ కొత్త హీరోను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోపిచంద్ ప్రస్తుతం సిటీమార్ మూవీ చేస్తున్నారు.