గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సినిమా సీటీమార్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే మంచి వసూళ్లను కూడా సాధించింది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటించింది. అలాగే మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మంచి హిట్ ను అందుకున్నారు.
ఇదిలా ఉండగా….ప్రస్తుతం చిత్రబృందం సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీటిమార్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో సినిమా ప్రారంభోత్సవం నుంచి పూర్తయ్యే వరకు చూపించారు.