చాలా కాలం నుంచి సరైన హిట్ లేక ఎదురు చూపులు చూస్తున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ సీటీమార్ సినిమా చేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఆంధ్ర కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్ నటించనున్నాడు. తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటించనుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను తాజా సమాచారం ప్రకారం ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై గోపిచంద్ ఆశలన్నీ పెట్టుకున్నారు.