కరోనా రిలీఫ్ ఇవ్వడంతో మూవీ మేకర్స్ ..తమ సినిమాల విడుదల పనుల్లో మునిగిపోయారు. ఓటీటీకీ ఇవ్వాలా.. లేక థియేటర్లకు వెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులు ఓటీటీ వైపు వెళ్లడంతో.. ఏయే సినిమాలు థియేటర్లకు వస్తుందన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో సీటీమార్ ఏ ప్లాట్‌ఫామ్ వస్తుందన్న దానిపై కొన్నాళ్లుగా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సీటీమార్ విడుదలపై క్లారిటీ ఇచ్చేశారు నిర్మాతలు.
ఈ మూవీ ఓటీటీలో వస్తుందని జరిగిన ప్రచారాన్ని ఖండించారు. సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే వస్తుందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ లో కలుసుకుందాం అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో గోపిచంద్ మీసం తిప్పుతున్న స్టిల్ ఆకర్షణగా మారింది.