టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన సీటి మార్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఇటీవల కాలంలో తేజ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడని.. ఈ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని టాక్ నడిచింది.
కాగా ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి గోపీచంద్, తేజ ఇద్దరూ కూడా ఎవరూ రియాక్ట్ అవ్వట్లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఈ ప్రాజెక్ట్‌లో పని చేయాలని అనుకున్న మాట నిజమే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో కూడా చేస్తామో లేదో తెలియదు. అలాగే శ్రీవాస్‌తో త్వరలోనే సినిమా ప్రారంభిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.