ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే అక్కినేని నాగార్జున ఏ సినిమా చేసినా సరే ఆయన ఫాన్స్ కి షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. కథల ఎంపిక విషయంలో ఆయన సీరియస్ గా లేకపోవడంతో ఎన్ని సినిమాలు చేసినా సరే హిట్ కావడం లేదని అంటున్నారు. అయితే ఆయన వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతోనే సినిమాలను లైట్ తీసుకున్నారు అనే టాక్ కూడా ఉంది ప్రస్తుతం.
గత 15 ఏళ్ళ కాలంలో ఆయన నుంచి చెప్పుకోదగిన హిట్ లేదు అనే చెప్పాలి. ఆయన కుమారులు సైతం ఇప్పుడు హిట్ ల కోసం ఎదురు చూస్తున్నారు. అఖిల్ అయితే కెరీర్ లో ఒక్కటి కూడా సరైన హిట్ కొట్టలేదు. ఇప్పుడు ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇదిలా ఉంచితే అక్కినేని నాగార్జున చేసిన ఒక ఫ్లాప్ సినిమా ఒక హీరో ని మిస్ అయింది. అసలు ఏంటీ ఆ సినిమా అనేది చూద్దాం.
నాగార్జున హీరోగా వీరభద్రం చౌదరి దర్శకుడిగా వచ్చిన సినిమా భాయ్. ఈ సినిమాకు అప్పట్లో మంచి హడావుడి చేసారు. చివరకు చూస్తే ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ కథను ముందు గోపిచంద్ కి చెప్తే ఆయన రిజెక్ట్ చేసారట. దీనితో ఆ పర్సనాలిటి ఉన్న నాగార్జునకు ఆ కథ చెప్తే ఆయన చేస్తాను అన్నారు. చివరకు సినిమా ఫ్లాప్ కాగా గోపిచంద్ బయటపడ్డాడు.