న్యూఇయర్ వేడుకల్లో బాగా తాగి పోలీసులకు దొరికిపోయిన మందుబాబులు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి క్యూ కట్టారు. డిసెంబర్ 31వ రోజు తప్పతాగి రోడ్లపై చిందులేసిన వారంతా సోమవారం కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. తాగితే వదిలేది లేదని ముందే మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అయినా పట్టించుకోకుండా రోడ్లపై చెలరేగి పోయిన వారిపై కేసులు బుక్ చేశారు.
న్యూ ఇయర్ కు ముందురోజు మందు తాగి బండ్లు నడిపిన వేలాదిమందిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుని వాహనాలు సీజ్ చేశారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారంతా సోమవారం తమ వాహనాల కోసం గోషా మహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్ కి క్యూ కట్టారు.
ప్రొసీజర్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారంతా కౌన్సిలింగ్ కు అటెండ్ అయ్యారు. థర్టీ ఫస్ట్ నైట్ మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
తాగి వాహనం నడిపిన 3,173 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పరిధిలో 1,413, రాచకొండ పరిధిలో 446 కేసులు, సైబరాబాద్ పరధిలో 1,314 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అయ్యాయి.