ఈ మధ్య కాలంలో జనాలు కాస్త కక్కుర్తితో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మాయ మాటలను చాలా వేగంగా నమ్మేస్తున్నారు. ఏది పడితే అది చెప్పే వాళ్లకు విలువ ఎక్కువ ఇస్తున్నారు. వెనుకా ముందు ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనితో చాలా మంది ఆర్ధికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ఇక దీనిపై పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా ఫలితం ఉండటం లేదు.
సోషల్ మీడియాలో జరిగే మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మోసాల పట్ల అప్రమత్తత పెద్దగా కనపడటం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ కాల్స్, ఆకర్షణీయమైన మాటలతో వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత న్యూడ్ గా కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు. వాటిని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.
తాజాగా ఒక న్యూడ్ కాల్ డాక్టర్ కొంప ముంచింది. ఓ డాక్టర్ నుంచి 72 లక్షలు వసూలు చేసారు యువతులు. నిన్న ఒక వ్యక్తి లైన్ లో దింపి 10 లక్షల వరకు లాగేశారు. దీనితో వాళ్ళు లబోదిబో మన్నారు. పోలీసులు చెప్తున్నా సరే కక్కుర్తి పడి చేస్తున్న పనులు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్త నెంబర్ నుంచి వచ్చే వీడియో కాల్స్ ని జాగ్రత్తగా గమనించాలి అని పోలీసులు సూచిస్తున్నారు.