శివసేన ఎంపీ, సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల క్యాంపులో చేరాలని తనకు గౌహతి నుంచి ఆఫర్ వచ్చిందని ఆయన అన్నారు.
తాను బాలాసాహెబ్ ఠాక్రే సిద్దాంతాలను పాటిస్తానని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తాను అసోం వెళ్లలేదని చెప్పారు.
ఇక మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లపై కూడా ఆయన స్పందించారు. ఒక బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరించడం తన బాధ్యత అని ఆయన వివరించారు.
కానీ ఈడీ అధికారులు పిలిచిన సమయం తనకు అనుకూలంగా లేదన్నారు. ఆ సమయంలోనే పార్టీలో సంక్షోభ పరిస్థితులు ఉండటం వల్ల మొదట విచారణకు హాజరు కాలేకపోయానన్నారు. ఆ తర్వాత విచారణలో ఈడీ అధికారులు తనతో మర్యాదగానే ప్రవర్తించారని ఆయన అన్నారు.