ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు తొంగిచూశాయి. డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కావాలనే సోషల్ మీడియాలో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు నిజంగా కోరుకుంటే ఎమ్మెల్యే బరిలో నిలుస్తానని అన్నారు.
బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు మేలు చేసేందుకే స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. కానీ కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రాజకీయం చేస్తున్నారన్నారు. ఉదయించే సూర్యునికి చెయ్యి అడ్డుపెట్టి ఎవరు ఆపలేరు, అలాగే నేను చేసే కార్యక్రమాలు కూడా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
అధిష్టానం సూచించిన విధంగా నడుకుంటానని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వర్గంలో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ,కుల్కచర్ల జెడ్పీటీసీ రాందాస్ ,పరిగి మాజీ జెడ్పీటీసీ బాబయ్య ,కుల్కచర్ల మాజీ జెడ్పీటీసీ నాగరాజు, ప్రస్తుత నల్గొండ రంగారెడ్డి జిల్లా నార్మస్ డైరెక్టర్ వెంకటరాంరెడ్డి ,వికారాబాద్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు.