గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి గౌతం రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరు తరలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం వరకు ఇంటి దగ్గరే ఉంచనున్నారు.
బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డికి అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు.
ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కడప వెళ్లి అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో ఉదయగిరికి చేరుకోనున్నారు.
గౌతంరెడ్డి మృతితో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వాయిదా వేశారు.