లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్ డీఐ)లకు కేంద్రం ద్వారాలు తెరిచింది. ఈ మేరకు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా)లో మార్పులు తెచ్చింది. తాజా మార్పులతో ఎల్ఐసీలో 20శాతం వరకు ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
గత నెలలో ఐపీఓ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ)కి ముసాయిదా పత్రాలను ఎల్ఐసీ సమర్పించింది. దీన్ని సెబీ ఇటీవల ఆమోదించింది. తాజాగా కొన్ని ప్రతిపాదనల మార్పులతో అభ్యర్థన(ఆర్ఎఫ్ పీ)ని దాఖలు చేసే పనిలో ఎల్ఐసీ ఉంది.
మొదట సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ తర్వాత కంపెనీలో ఎఫ్ డీఐలను తీసుకురావడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మార్చి 14న పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) సవరించింది.
ఎప్ డీఐ విధానంలో మార్పులతో డీపీఐఐటీ నిబంధనలను అమలు చేయడానికి ఫెమా నోటిఫికేషన్ అవసరం. ఈ నిబంధనలను విదేశీ మారక నిల్వల నిర్వహణ చట్టం(నాన్-డెట్ ఇన్ స్ట్రుమెంట్స్) సవరణ నిబంధనలు-2022గా పిలవవచ్చని ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.