మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్లింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది. దీనిపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేయనుంది.
గతంలో ఫాం హౌస్ కేసను సీబీఐకి అప్పగించాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఫాంహౌస్ కేసు సీబీఐకి అప్పగించాలని తీర్పు చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది.
ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ దర్యాప్తు సరిగా లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదానలు విన్న హైకోర్టు 2022 డిసెంబర్ 26న సిట్ ను రద్దు చేయడంతో పాటు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.