స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలంగాణలో ఐదు షో లు థియేటర్స్ లో వేసేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది.
ఈనెల 30 వరకు ఐదు షో లు వేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.