తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆనందోత్సాహాలు పంచాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ కొత్త ఏడాదిలో సామాజిక రుగ్మతలపై పోరుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై పట్టు విడవకుండా పోరాటం చేసి విజయం సాధించామన్నారు.
రాబోయే ఏడాదిలో దేశం మరెన్నో విజయాలు సొంత చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా సాధారణ ప్రజలతో ఇంట్రాక్ట్ కోసం జనవరి 1న రాజ్ భవన్ తెరిచే ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ప్రజలకు గవర్నర్ అందుబాటులో ఉంటారని అధికారులు వెల్లడించారు.